ఆరా తీసి..అప్పగించి.. | - | Sakshi
Sakshi News home page

ఆరా తీసి..అప్పగించి..

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

దండేపల్లి: లక్సెట్టిపేటకు చెందిన బాలిక దండేపల్లి పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు స్నేహితులతో కలిసి వచ్చే ఆమె గురువారం ఒంటరిగా వచ్చింది. పాఠశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో తప్పి పోయి దండేపల్లి బస్టాప్‌ వద్ద ఏడుస్తుండడంతో కానిస్టేబుల్‌ దివ్య బాలిక వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీసింది. బాలిక నోట్‌బుక్‌పై తండ్రి ఫోన్‌నంబర్‌ రాసి ఉండటంతో అతనికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి మల్ల వ్వకు బాలికను అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ దివ్యను ఎస్సై రాజర్దన్‌, సీఐ రమణమూర్తి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement