కొడుకును సాకుతూ.. ‘సాగు’తూ.. | - | Sakshi
Sakshi News home page

కొడుకును సాకుతూ.. ‘సాగు’తూ..

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

వీల్‌చైర్‌లో కుమారుడిని చూసుకుంటూ పని చేస్తున్న రేవతి

అమ్మ ప్రేమకు ఎలాంటి నిర్వచనం అవసరం లేదు. బిడ్డల కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్న మాతృమూర్తులు ఎందరో.. భోరజ్‌ మండలం సిర్సన గ్రామానికి చెందిన నాగరాడే విఠల్‌, రేవతి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సాయికిరణ్‌ మానసిక దివ్యాంగుడు. ఇంటి వద్ద అతడిని చూసేవారు ఎవరూ లేరు. దీంతో తల్లి రేవతి సాయి కిరణ్‌ను నిత్యం చేను వద్దకు తీసుకువస్తోంది. ఓ వైపు సాగు పనులు చేసుకుంటూనే కుమారుడికి అన్నం తినిపించడం, నీళ్లు తాగించడం తదితర సపర్యలు చేస్తోంది. బిడ్డ క్షేమమే తనకు ముఖ్యమని, కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారమైన నేపథ్యంలో అతని వెంట తీసుకురావడం తప్ప మరోమార్గం లేదని ఆమె చెబుతోంది. – సాత్నాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement