మందమర్రిరూరల్: పట్టణంలోని జాతీయ రహదారిపై టోల్‌గేట్ వద్ద గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాలీ ఆటోలో 50 వంద గ్రాముల నకిలీ జెమినీ టీపౌడర్ ప్యాకెట్లు లభించాయి. పోలీసులు జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాసురామ్‌కు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు వాహనదారుడు సంపత్‌రెడ్డిని టీ పౌడర్ ప్యాకెట్స్ ఎక్కడ కొనుగోలు చేశావని ప్రశ్నించగా మార్కెట్‌లోని మహేశ్వరీ ట్రేడర్స్‌లో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. వెంటనే దుకాణంలో తనిఖీ చేయగా ఎలాంటి జీరో పౌడర్ ప్యాకెట్లు లభించలేదు. టోల్‌గేట్ వద్ద దొరికిన ప్యాకెట్లను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించామని, కిరాణ దుకాణానికి లైసెన్స్ లేకపోవడంతో నిర్వాహకునికి నోటీస్ ఇచ్చినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


