ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రె ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్‌తో కలి సి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అ ర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దుర్గం అమ్మక్క, తమ పట్టాభూమిని కొలతలు చేసి హద్దులు వేయాలని కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్‌కు చెందిన సోగాల సోమయ్య, బీమా డబ్బులు ఇప్పించాలని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన కంపె ల లలిత, తమ వ్యవసాయ భూమి పట్టా చేయాల ని చిర్రకుంటకు చెందిన రాంటెంకి అమ్ముబాయి, మరి కొంతమంది వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు.


