ప్రధానమంత్రి కృషి సంచాయ్ పనుల పరిశీలన
లింగాపూర్: మండలంలోని జాముల్‌ధర, వంకామద్ది గ్రామాల్లో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం (2.0)లో భాగంగా చేపట్టిన పనులను మంగళవారం జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థల అధికారి డాక్టర్ సాంబశివరావు పరిశీలించా రు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించా రు. జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఆంజనేయులు, జాముల్‌ధర సర్పంచ్ జుగనాక గంగాదేవిరమేశ్, టెక్నికల్ అసిస్టెంట్ షేక్ హైమాద్, బోడ తిరుపతి, ఏపీఎం సూర్యకాంత్, పంచాయతీ కార్యదర్శి పాపయ్య పాల్గొన్నారు.


