● ఆశించిన ధర లేక రైతుల ఇళ్లలోనే పంట నిల్వ ● భద్రత చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాల ముప్పు ● అవగాహన లేక దూదిలో ఆటలు, నిద్ర ● శ్వాస ఆడక మృతి చెందుతున్న చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

● ఆశించిన ధర లేక రైతుల ఇళ్లలోనే పంట నిల్వ ● భద్రత చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాల ముప్పు ● అవగాహన లేక దూదిలో ఆటలు, నిద్ర ● శ్వాస ఆడక మృతి చెందుతున్న చిన్నారులు

Jan 8 2026 7:12 AM | Updated on Jan 8 2026 7:12 AM

● ఆశి

● ఆశించిన ధర లేక రైతుల ఇళ్లలోనే పంట నిల్వ ● భద్రత చర్యల

● ఆశించిన ధర లేక రైతుల ఇళ్లలోనే పంట నిల్వ ● భద్రత చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాల ముప్పు ● అవగాహన లేక దూదిలో ఆటలు, నిద్ర ● శ్వాస ఆడక మృతి చెందుతున్న చిన్నారులు

కౌటాల: ఆశించిన ధర కోసం రైతులు ఇంట్లో నిల్వ చేసుకుంటున్న పత్తి పంట చిన్నారుల ఊపిరి తీస్తోంది. దూదిలో సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకునే పసివారిని విగతజీవులుగా మారుస్తోంది. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో కౌటాల మండలంలో పత్తిలో 12 ఏళ్ల బాలుడు దాగుడుమూతలు ఆడుతూ శ్వాస ఆడక మృతి చెందగా, కెరమెరి మండలం కరంజీవాడ(అంద్‌గూడ)లో ఈ నెల 5న 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట ఇంట్లోని ఆశాదీపాలను ఆర్పివేస్తూ.. కన్నవారికి తీరని కడుపు కోతను మిగులుస్తోంది.

అమ్ముదామా.. ఆగుదామా..

జిల్లాలోని రైతులు వానాకాలం సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు ఆశించిన ధర లేక రైతులు ఇంట్లో నిల్వ ఉంచుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.8100 ప్రకటించినా వివిధ కారణాలతో ఇటీవల సీసీఐ కేంద్రాల్లో రూ.100 తగ్గించారు. కొనుగోళ్లకు సీసీఐ అధికారులు తేమ పేరిట కొర్రీలు పెడుతుండగా, ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటా పత్తికి రూ.7 వేల వరకే చెల్లిస్తున్నారు. అమ్ముదామా.. ఆగుదామా.. అనే సంశయంలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ఇంకా మొదట తీసిన పత్తిని కూడా అమ్ముకోలేదు. దిగుబడి లేకపోవడంతో రెండో విడతకే మొత్తం పత్తితీత పూర్తవుతుంది.

ఇళ్లలోనే నిల్వ

పత్తి ధర పెరుగుతుందేమో అనే ఆశతో చాలామంది పంట దిగుబడులు ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు. పెట్టుబడి పెరిగినా.. దిగుబడి తగ్గడంతో అనుకున్న రేటు వచ్చినప్పుడే అమ్ముకుందామని వేచి చూస్తున్నారు. ఇది కొందరి పాలిటశాపంగా మారుతోంది. అవగాహన లేకపోవడం, భద్రత చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలకు దారి తీస్తోంది. విద్యుత్‌, అగ్ని ప్రమాదాలతో వేలాది క్వింటాళ్ల పత్తి కాలిపోయి రైతులు నష్టపోతున్నారు. జనవరిలో సంక్రాంతి పండుగ సెలవులు వస్తుండటంతో పిల్లలు ఇళ్లకు చేరుకుంటున్నారు. స్నేహితులతో కలిసి పత్తిలో ఆడుకుంటున్నారు. ఇది వారి ప్రాణాలకే ముప్పుగా మారుతోంది.

రైతు ఇంట్లో నిల్వ ఉన్న పత్తి(ఫైల్‌)

● ఆశించిన ధర లేక రైతుల ఇళ్లలోనే పంట నిల్వ ● భద్రత చర్యల1
1/1

● ఆశించిన ధర లేక రైతుల ఇళ్లలోనే పంట నిల్వ ● భద్రత చర్యల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement