అధ్యాపకురాలికి డాక్టరేట్
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఇట్నూరి శారద డాక్టరేట్ పట్టా పొందినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి గురువారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రేమలత పర్యవేక్షణలో డిజైన్, సింథసిస్ అండ్ కంప్యూటేషనల్ స్టడీస్ ఆఫ్ ఇండోల్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం శారదకు డాక్టరేట్ ను ప్రకటించింది. శారదను ప్రిన్సిపాల్‌తోపా టు అధ్యాపకులు లక్ష్మీనరసింహం, జనార్ధన్, రాజేశ్వర్, కృష్ణవేణి, దేవేందర్, రోజ్‌మేరి, సాంబవి, సానియా అభినందించారు.


