రాష్ట్రస్థాయిలో రాణించాలి
రెబ్బెన: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో మొదటి స్థానంలో నిలవాలని డీవైఎస్‌వో అష్వక్ అహ్మద్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం బాల్‌బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో డీవైఎస్‌వోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రవితేజ, అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, పీఈటీ భాస్కర్, కోలిండియా కోచ్ రాకేశ్, సీనియర్ క్రీడాకారులు నరేశ్, శ్రీకాంత్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


