పండుగ పూట జరభద్రం!
కౌటాల: అసలే సంక్రాంతి పండుగ సెలవులు.. ప్రజ లు ఇళ్లు విడిచి ఊరెళ్తే దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. తాళం వేసిన ఇళ్లకు టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగజ్‌నగర్, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), పెంచికల్‌పేట్, కౌటాల, రెబ్బెన మండలాల్లో అధికంగా దొంగతనాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా, పోలీస్ పెట్రోలింగ్. తనిఖీలు, కొనసాగుతున్నా చోరీలకు అడ్డుకట్ట పడటం లేదు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం..
జిల్లాలో 2025లో 58 వరకు ఇళ్లలో చోరీలు జరగగా, 151 వరకు దొంగతనాలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. నగదు, బంగారు. వెండి తదితర ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు. పండుగ సమయంలో జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. దొంగలు కాలనీల్లో పగటిపూట రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీకి పాల్పడే అవకాశం ఉంది. అందినకాడికి దోచుకుని మహారాష్ట్రకు పారిపోతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.
కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీకి చెందిన దండె మంగ ఇంట్లో ఈ నెల 5న దొంగలు పడ్డారు. ఈ నెల 3న మంగ ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని కుమార్తె వద్దకు వెళ్లింది. తిరిగి 5వ తేదీన ఇంటికి వచ్చింది. తలుపులు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడు తులాల బంగారం, కిలో వెండి
ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పండుగ పూట జరభద్రం!


