రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఆదర్శనగర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖేల్‌కూద్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానాచార్యులు శ్రీవాణి శుక్రవారం తెలిపారు. ఈ నెల 8న మంచిర్యా ల జిల్లాలో నిర్వహించిన విభాగ్ స్థాయి ఖేల్‌కూద్ పోటీల్లో పాఠశాలకు చెందిన సోనాక్షి, విష్ణుశ్రీ, ఎస్‌కే ఫౌజియా, ఎ.అక్షర 800 మీట ర్ల పరుగు పందెం, సిద్దిక్ క్యారమ్‌లో ప్రథమ బహుమతి సాధించారని తెలిపారు. వీరు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.


