ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి
కాగజ్‌నగర్‌టౌన్: విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని ఎంఈవో ప్రభాకర్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని డివిజనల్ రిసోర్స్ సెంటర్‌లో శుక్రవారం ఎన్‌సీఈఆర్టీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెడ్‌ఎడ్ టాక్స్ ఇంగ్లిష్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎల్టా ఆధ్వర్యంలో నిర్వహించిన పో టీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నా రు. కార్యక్రమంలో విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, విద్యాశాఖ కోఆర్డినేటర్ శాంతికుమార్, తులసీరామ్, హదియా, వెంకటేశ్వర్, శంకర్‌రావు, శ్రీనివాస్, సత్యం, మల్లయ్య పాల్గొన్నారు.


