డార్ఫ్ దంపతుల సేవలు ప్రశంసనీయం
కెరమెరి: హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు ఆదివాసీలకు చేసిన సేవలు ప్రశంసనీయమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జైనూర్ మండలం మార్లవా యిని గురువారం సందర్శించారు. ఈ నెల 11న నిర్వహించే డార్ఫ్ దంపతుల వర్ధంతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులకు దుప్పట్లు అందించారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యాప్రాముఖ్యత, క్రమశిక్షణ, అలవాట్లు, తదితర విషయాలపై అవగాహన కల్పించా రు. చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. వర్ధంతి కార్యక్రమంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్, ఎస్సై రవీందర్, సర్పంచ్ కనక ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.


