ధ్యానంతో వ్యక్తిత్వ వికాసం
రెబ్బెన: ధాన్యం వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు గురువారం ముగిశాయి. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు గంటపాటు ధ్యానంపై అవగాహన కల్పించి సాధన చేయించారు. జీఎం మా ట్లాడుతూ ధ్యానంతో రుగ్మతలు తగ్గి సంపూర్ణ ఆరో గ్యం చేకూరుతుందన్నారు. ఏకాగ్రత పెరుగుతుంద ని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీవో మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులు దీపక్, జయలక్ష్మి, రాజన ర్సు, మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


