‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనకు ఎంఈవోలు, హెచ్‌ఎంలు ముందస్తు ప్రణాళిక రూ పొందించాలన్నారు. విద్యార్థులు వందశాతం పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. గైర్హాజరైన వారి తల్లిదండ్రులతో తరచూ మాట్లాడాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఈ మూడు నెలలు కీలకమని పేర్కొన్నారు. వెనుకబడిన వారిపై దృష్టి సా రిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూ చించారు. ఎస్‌ఏ– 1 పరీక్షల్లో ఉత్తీర్ణతను ఆధారంగా చేసుకుని బోధన కొనసాగించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


