‘మీ వెంటే దీక్ష చేస్తాం’
ఆరు నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో రేయింబవళ్లు కార్యాలయం ఎదుట బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్టు కార్మికుడు మల్లేశ్ కొద్దిరోజులుగా ఇంటికి వెళ్లడం లేదు. బుధవారం ఆయన భార్య కళావతి సమ్మె శిబిరానికి చేరుకుని కన్నీంటి పర్యంతమైంది. న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాల కోసం కూడా చలిలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పోరాటంలో పాలుపంచుకుని పిల్లలతో సహా వచ్చి ఇక్కడే దీక్ష చేస్తామని రోదించింది. దీంతో తోటి మహిళా కార్మికులు కళావతిని ఓదార్చారు.


