సురక్షిత ప్రయాణమే లక్ష్యం
● రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమాసింగ్ ఠాకూర్
కాగజ్‌నగర్‌రూరల్: రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడమే తమ లక్ష్యమని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమాసింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. కాగజ్‌నగర్‌లోని రైల్వేస్టేషన్‌లో బుధవారం రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐజీ మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మోసాలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆర్‌పీఎఫ్ కేవలం ఆస్తుల రక్షణకే పరిమితం కాకుండా మహిళల భద్రత, పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధం, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్‌కుమార్, కాగజ్‌నగర్ ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రమణకుమార్, కాజిపేట జీఆర్‌పీ సీఐ నరేశ్‌కుమార్, ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై దాసు, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


