సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎంకు వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ నియోజవకర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాద్ ప్రగతి భవన్‌లో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు కొండా లక్ష్మ ణ్‌బాపూజీ పేరు నామకరణం చేసినా కాలేజీ వద్ద బోర్డు ఏర్పాటు చేయలేదని, సంబంధిత వెబ్‌సైట్‌లోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నమోదు చేయాలని కోరారు. అలాగే చత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. కార్యక్రమంలో అనుమాండ్ల జగదీష్ ఉన్నారు.


