‘కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగట్టాలి’
రెబ్బెన: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మంగళవారం నిర్వహించిన ఏఐటీయూసీ గేట్‌మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీన పరుస్తూ 29 చట్టాలను 4 కోడ్‌లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కొత్త గనుల ఏర్పాటు, కార్మిక సమస్యలపై మాట్లాడటానికి తెలంగాణకే తలమానికంగా ఉన్న సింగరేణికి శాశ్వత సీఅండ్‌ఎండీని నియమించాలన్నారు. తాడిచర్ల 2 గనిని జెన్‌కోకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 20 మంది మహిళా కార్మికులు ఏఐటీయూసీలో చేరగా వారికి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. బ్రాంచి కా ర్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, జీఎం కమిటీ సభ్యులు శేషశయన రావు, రాజేశ్, సహాయ కార్యదర్శి ఓదెలు, ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకులు


