వినాయకుడికి ఘనంగా పూజలు
ఆసిఫాబాద్‌అర్బన్: అంగారిక చతుర్థి పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ శ్రీ గణపతి దేవాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వా రికి అర్చకులు ఒజ్జల శిరీష్‌శర్మ, శ్రీనివాస్‌శర్మ ల ఆధ్వర్యంలో అభిషేకం అష్టోత్తర శతనా మావళి, గరికపూజ, మంగళహారతి, మహా మంత్రపుష్పం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. చతుర్థి సందర్భంగా భక్తులు రాత్రి 9 గంటలకు చంద్రోదయం తర్వాత ఉపవాసదీక్షలు విడిచారు. ప్రత్యేక పూజలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.


