ధ్యానంతో మానసిక ప్రశాంతత
రెబ్బెన: ధ్యానంతో మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు, సింగరే ణి అధికారులు, ఉద్యోగులకు గంట పాటు ధ్యానంపై అవగాహన కల్పించి సాధన చే యించారు. మూడు రోజుల పాటు ధ్యాన శిక్షణ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులు దీపక్, జయలక్ష్మి, రాజనర్సు, ఏరియా ఇంజనీరు కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్ బెహరా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


