రక్తదానం ప్రాణదానంతో సమానం
కౌటాల: రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా వైద్యశాఖ అధికారి సీతారాం అ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగద్గురు రామానందాచార్య దక్షిణ్ పీఠం నానీజ్‌థామ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన 18 నుంచి 55 ఏళ్లలోపు వారు మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు రక్తం దొరకడం లేదన్నారు. ఈ సందర్భంగా 111 మంది నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై చంద్రశేఖర్, వైద్యులు రవీంద్రకుమార్, అజ్మత్, నవ త, పవన్ కళ్యాణ్‌రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేందర్, కమిటీ సభ్యులు కాలిదాస్, పండరి, తులసీరాం, మహేంద్ర, బావుజీ, దోమాజి, తదితరులు పాల్గొన్నారు.


