విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
రెబ్బెన: విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. సో మవారం రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల వివరాలు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
గంగాపూర్ జాతర ఏర్పాట్లు పరిశీలన..
మండలంలోని గంగాపూర్ వద్ద నిర్వహించనున్న జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశాంచారు. ఈ కార్యక్రమంలో సీఐ సంజయ్, ఎస్సై వెంకట కృష్ణ, జాతర నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన న్యాయవాదులు
ఆసిఫాబాద్: జిల్లా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో న్యాయవాదులు ఎస్పీ నితిక పంత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద క్యాలెండర్, స్వీట్ అందజేశారు. ఎస్పీని కలిసిన వారిలో సీనియర్ న్యాయవాదులు బోనగిరి సతీశ్‌బాబు, జుమ్మిడి రాజేశ్, మంతెన చరణ్‌తేజ, ధీరజ్ భౌమిక్, ఇగురుపు సంజీవ్, అశోక్, జాబరి నవీన్ ఉన్నారు.
ఎస్పీని కలిసిన ఆర్టీసీ కార్మికులు
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఎస్పీ నితిక పంత్‌ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్, ఎఫ్‌సీఐ బోర్డు సభ్యులు పులుగం తిరుపతి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దివాకర్, జాడి లక్ష్మణ్, కార్మికులు ఉన్నారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి


