నాణ్యమైన విద్య అందించాలి
కౌటాల: ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. సోమవారం బోదంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించా రు. పాఠశాలలోని సౌకర్యాలు, విద్యాప్రమాణాలు, తరగతి గది నిర్వహణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకా రం భోజనం పెట్టాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలన్నారు. అనంత రం మండల కేంద్రంలోని శ్యామ్ మోడల్ పాఠశాల ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో కోట ప్రసాద్, ఎంఈవో గావుడే హన్మంతు ఉన్నారు.
వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆసిఫాబాద్‌రూరల్: వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితా ల సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో కేజీబీవీ పాఠశాలల ఎస్‌వోలు, ప్రిన్సి పాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అర్థమయ్యేరీతిలో విద్యాబోధన చేయాలన్నారు. వందశా తం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకో వాలన్నారు. విద్యాశాఖ ఎస్‌వో అబిద్ అలీ, కేజీబీవీ ఎస్‌వో భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


