ముగిసిన అటల్ టింకరింగ్ కమ్యూనిటీ ప్రోగ్రాం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న అటల్ టింకరింగ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సైన్స్ అధికారి కటు కం మధుకర్ మాట్లాడుతూ విద్యార్థులు నే ర్చుకున్న అంశాలను నిత్యజీవితంలో ఉపయోగించుకొని కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. అనంతరం వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఉదయం పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దేవభూషణం, రాధాకృష్ణాచారి, సహాకార్యదర్శి భోగ మధుకర్, వేణుగోపాల్, శిక్షకులు సాయికృష్ణ, ల్యాబ్ ఇన్‌చార్జి శ్రీకాంత్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


