పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తుల నిరసన
లింగాపూర్: జోడేఘాట్ డిప్యూటీ రేంజ్ అధికారి జ్ఞానేశ్వర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ ఆత్మారాం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాదవ్ లోకేందర్ మాట్లాడారు. గ్రామానికి చెందిన ఓ మహిళను రేంజ్ అధికారి అకారణంగా దూషించాడని ఆరోపించారు. చేనులో ఎందుకు బోర్ వే యించావు.. అనుమతి ఎవరు ఇచ్చారంటూ గ్రామస్తుల ఎదుట అవమానపర్చాడని పేర్కొన్నారు. రేంజ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై గంగన్నకు ఫిర్యాదు చేశామని తెలిపారు.


