నియంతృత్వానికి చరమగీతం పాడాలి
కాగజ్‌నగర్‌రూరల్: దేశంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని 21, 22, 26, 30 వార్డులతో పాటు మార్కెట్ ఏరియాలో మంగళవారం జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంబేడ్కర్ ఇచ్చిన స్వేచ్ఛ, సామాజిక సమానత్వాన్ని బీజేపీ నుంచి కాపాడాలని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
కోఆర్డినేటర్‌గా సిడాం గణపతి
బెజ్జూర్: జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమానికి సిర్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి నియమించినట్లు ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు తెలిపారు. అలాగే బెజ్జూర్ మండలానికి కోఆర్డినేటర్‌గా బండి మహేశ్, చింతలమానెపల్లి సామల రాజన్న, పెంచికల్‌పేట్ మడావి కోటేశ్, దహెగాం రాచకొండ కృష్ణ, కాగజ్‌నగర్ పట్టణం వందన, కాగజ్‌నగర్ రూరల్ రమేశ్, కౌటాల పిల్లల శంకరయ్య, సిర్పూర్(టి) అష్రత్‌ను నియమించినట్లు వారు వెల్లడించారు.


