ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన అజిత్ మేసీ్త్ర తాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల పాక నిర్మించానని, బిల్లు మంజూరు చేయాలని, కౌటాల మండలం బాదంపల్లికి చెందిన కొండగుర్ల రాజ్‌కుమార్ దళిత బంధు పథకం కింద రైస్‌మిల్లు నిర్మించుకున్నానని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన సిడాం గోదావరి పీఎం విశ్వకర్మ పథకంలో గోల్డ్‌స్మిత్ శిక్షణ పూర్తి చేశానని, రుణ సౌకర్యం కల్పించాలని కోరారు.
పరిహారం ఇప్పించాలి
మాది కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామం. మా వ్యవసాయ భూముల్లోంచి రైల్వే లైన్ పోయింది. నష్టపరిహారం కోసం మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్ చొరవచూపి మేము కోల్పోయిన వ్యవసాయ భూములకు పరిహారం ఇప్పించాలి.
– లింగయ్య, నగేష్, రాజ్‌కుమార్, వంజిరి
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి


