ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ వంటి మహనీయులను గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం బీజేపీ మతతత్వ రాజకీయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవస్థల కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్రానికి పంపించామని, తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు భాస్కర్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి సుగుణ, మాజీ ఎమ్మెల్యే సక్కు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ ఎంపిపి బాలేశ్వర్‌గౌడ్, నాయకులు గుండాశ్యాం, మల్లేశ్, మునీర్, చరణ్, వసంత్‌రావు, అసద్, శివప్రసాద్, గోపాల్‌నాయక్, జావీద్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.


