ఆసిఫాబాద్: లింగాపూర్ మండలం చోర్‌పల్లిలో ఈ నెల 22, 23 తేదీల్లో ఇందిర ఫెల్లోషిప్ తెలంగాణ రాష్ట్ర బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు శక్తి అభియాన్ ఇందిర ఫెల్లోషిప్ ఆదిలాబాద్ లోక్‌సభ కోఆర్డినేటర్, పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫెల్లోషిప్ బ్యూట్ క్యాంప్‌నకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరవుతారని తెలి పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జ్ఞాపకార్థం రాజకీయాలు, పాలనతో సహా వివిధ రంగాల్లో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ ఇందిర ఫెల్లోషిప్ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇందిర ఫెల్లోషిప్ సభ్యులు దుర్గం కళావతి, యశోద, ఇందిర, ప్రతిభ, విజయ, రాజేశ్వరి, పద్మ, శంకరమ్మ, రేణుక, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ శ్యాం, నాయకులు సుధాకర్, భీమ్‌రావు, తిరుపతి, గంగారాం, సురేశ్ పాల్గొన్నారు.