
కూలీలకు వంద పనిదినాలు కల్పించాలి
పెంచికల్‌పేట్(ఆసిఫాబాద్): ఉపాధిహామీ పథకంలో కూలీలకు వంద పనిదినాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి పనిదినాలు కల్పించాలన్నారు. పనులను ముందుగా గుర్తించి సుమారు వందమంది కూలీలు పనిచేసేలా ప్రోత్సహించా లని సూచించారు. పంచాయతీల్లోని నర్సరీలను ప్రతిరోజూ సందర్శించి మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్బర్ట్ తదితరులు ఉన్నారు.