వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: వృద్ధుల విషయంలో గౌరవంగా వ్యవహరించడాన్ని అందరూ బాధ్యతగా భావించాలని డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌ సూచించారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని గురువారం టీటీడీసీ భవనంలో నిర్వహించగా పలువురిని సత్కరించి గొడుగులను బహుకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఏ.ప్రమీల, అడిషనల్‌ డీఆర్‌డీఓ జయశ్రీ, సెర్ప్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, ఉద్యోగులు పి.ఆంజనేయులు, వై.పద్మలత, కె.వీరభద్రం, వి.నవీన్‌, ఎస్‌.పూర్ణిమ, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కె.సంధ్య, విజయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement