ఈనెలాఖరులోగా అందరికీ యూనిఫామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఈనెలాఖరులోగా అందరికీ యూనిఫామ్‌

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

నేలకొండపల్లి: ఈనెల చివర వారం లోపు ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థికి రెండేసి జతల యూనిఫామ్‌ అందించాలని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి కె.రవిబాబు సూచించారు. మండలంలోని నాచేపల్లి ప్రభుత్వ పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆయన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి మెనూ అమలుపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులను ప్రగతిని పరిశీలించారు. ఆ తర్వాత మండల పరిషత్‌ కార్యాలయంలో ఐకేపీ ఉద్యోగులతో సమావేశమైన డీఐఈఓ యూనిఫామ్‌ సరఫరా జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుట్టులో కూడా తేడా రాకుండా చూస్తూ ఈ నెలాఖరులోగా అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఐకేపీ ఏపీఎం కట్టా సురేందర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

బాలబాలికల రెజ్లింగ్‌

జిల్లా జట్ల ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లాస్థాయి పాఠశాలల క్రీడాపోటీల్లో భాగంగా అండర్‌–14, 17 రెజ్లింగ్‌ జట్లను గురువారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జట్లకు ఎంపిక చేసినట్లు జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావు తెలిపారు. అండర్‌–14 బాలురలో ఎస్‌.కే.ఫిరోజ్‌బాబా, సీహెచ్‌.యూ.ఉమేష్‌శర్మ, కే.కే.దినేష్‌, సుజిత్‌, బాలికల జట్టుకు ఎస్‌.సిరిచందన, నాగలక్ష్మి, డి.మానస, నిత్య, ఎస్‌కే.అనీఫా, ప్రసన్నకుమారి, అండర్‌–17 బాలుర జట్టుకు పి.తరుణ్‌, ఎస్‌.కే.సాధిక్‌, ఎస్‌.కే.తారిఫ్‌, కె.సందీప్‌, బాలికల విభాగంలో ఎస్‌కే.ఆశాభి, ఎస్‌.రక్షిత, ఎ.అక్షయ్‌ ఎంపికయ్యారని వెల్లడించారు.

4న సీనియర్‌ ఆర్చరీ జట్లు ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: ఈనెల 4న ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్‌ ఆర్చరీ జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాధుల సారంగపాణి, పుట్టా శంకరయ్య తెలిపారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఇండియాన్‌, రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో జరుగుతాయని, హాజరయ్యే క్రీడాకారులు గుర్తింపు కార్డుతో రావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.

అండర్‌–19 క్రీడా జట్లు..

ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌–19 బాలబాలికల హ్యాండ్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ జట్లను 4వ తేదీన ఖమ్మం పటేల్‌ స్టేడియం, హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి ఎండీ.మూసాకలీం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఎస్‌ఎస్‌సీ మెమో, ఆధార్‌ కార్డుతో హాజరుకావాలని, వివరాలకు 98483 41238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌లో

అగ్రస్థానాన నిలపాలి

ఖమ్మం సహకారనగర్‌: ఫౌండేషనల్‌ లిటరసీ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌)లో జిల్లాను అగ్రస్థానాన నిలపాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సూచించారు. ఖమ్మం సైన్స్‌ మ్యూజియంలో సెప్టెంబర్‌ నెలకు సంబంఽధించి ఎఫ్‌ఎల్‌ఎన్‌ సమీక్ష గురువారం జరగగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని 230 పాఠశాలలను బృందాలు సందర్శించినందున, క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని తెలిపారు. ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్‌ కుమార్‌, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement