గుర్తుతెలియని వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వృద్ధుడు మృతి

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

ఖమ్మంక్రైం: జిల్లా ప్రధాన ఆస్పత్రి సమీపాన గుర్తుతెలియని వృద్ధుడి (65) మృతదేహాన్ని గురువారం గుర్తించారు. మృతుడు తెల్ల షర్ట్‌, గల్లా లుంగీ ధరించి ఉండగా, అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించినట్లు ఖమ్మం టూటౌన్‌ పోలీసులు తెలిపారు. సదరు వృద్ధుడు అనారోగ్యంతో అతను మృతి చెందినట్లు భావిస్తుండగా, ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై లారీ బోల్తా

వేంసూరు: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై వేంసూరు మండలం చౌడవరం సమీపాన గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ మార్గంలో లారీ అతి వేగంగా వెళ్తుండగా అదుపు తప్పింది. ఈక్రమాన డివైడర్‌లోని యూ–టర్న్‌ రెయిలింగ్‌, మెటల్‌ బీమ్‌ క్రాష్‌ బారియార్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో ప్రాణహానీ జరగకపోగా, ఘటనాస్థలి నుంచి లారీ డ్రైవర్‌ పరాయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement