ఖమ్మంగాంధీచౌక్: మానవ జీవితాన్నీ ప్రతిబింబించేలా రాచమళ్ల ఉపేందర్ కథలు ఉన్నాయని కాళోజీ అవార్డు గ్రహిత సీతారాం పేర్కొన్నారు. అక్షరాల తోవ సాహిత్య సంస్థ ఆధ్వర్యా న ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉపేందర్ రచించిన ‘ఉడికిన మెతుకు’ కథల సంపుటి, ‘అక్షరానుభూతి’ సమీక్షల సంకలనం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ రాచమల్ల చుట్టూ జరిగే ఘటనలను విస్తృతంగా పరి శీలిస్తారని, అందుకే అద్భుతమైన కథలు రాశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి నామా పురుషోత్తం, సయ్యద్ షఫీ అధ్యక్షత వహించగా కవులు, రచయితలు పొత్తూరు సీతారామారావు, కన్నెగంటి వెంకటయ్య, కోండ్రు బ్రహ్మం, వురిమల్ల సునంద, కోమాకుల సీతారాములు, లెనిన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూని యర్, జూనియర్ బాలబాలికల నెట్‌బాల్ జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహించారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీలకు 120మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పదిరోజుల శిక్షణ ఇచ్చాక, తుది జట్టుకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలి పారు. హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాడెంట్ పి. వరవిమారుత్‌తో పాటు డాక్టర్ రవి, సీహెచ్.దీపిక, ఎన్.ఫణికుమార్ పాల్గొన్నారు.
త్వరలోనే జాతీయస్థాయి కరాటే పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో రాష్ట్ర, జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నట్లు డీఐఈ ఓ రవిబాబు తెలిపారు. ఈ పోటీ ల తేదీలు త్వరలోనే ఖరారవుతాయని పేర్కొన్నారు. తొలిసారి ఖమ్మంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించనుండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోటీల విజయవంతానికి కరాటే మాస్టర్లు భాగస్వాములు కావాలని కోరారు.
‘ఉపాధ్యాయులే లేకుండా తనిఖీలా?’
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలల్లో సరిడా బోధనా సిబ్బంది లేకుండానే ప్యా నల్ ఇన్‌స్పెక్షన్ పేరుతో తనిఖీలు చేపట్టడం సరి కాదని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(టీఎస్‌పీటీఏ) జిల్లాఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ హసన్, ఎన్.రామకృష్ణ పేర్కొన్నా రు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, వసతులు కల్పించకుండానే తనిఖీల పేరుతో ఆందోళనకు గురిచేయడం గర్హనీయమన్నారు. గత బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బి.ప్రశాంత్ పని వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలి పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తనిఖీలు నిలిపివేయాలని వారు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
సంజ్ఞా భాషకు గుర్తింపు, ప్రచారం కల్పించాలి
ఖమ్మంమయూరిసెంటర్: బధిరులపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడి సంక్షేమంపై దృష్టి సా రించాలని బధిరుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్, రామకృష్ణ కోరారు. ప్రపంచ సంజ్ఞాభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బధిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం సంజ్ఞా భాషను గుర్తించి తగిన ప్రచారం కల్పించా లని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో సంజ్ఞాభాషపై అవగాహన కల్పిం చాలన్నారు. విరివిగా వాడేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో వీరస్వామి, మహేష్, సరిత, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హక్కులు, సంజ్ఞా భాష ప్రాముఖ్యతపై జయరాం, ప్రభాకర్ ప్రసంగించారు.
రూ.25వేల విలువైన
గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆదివారం చేపట్టిన తనిఖీ ల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా ప్రాంతం నుంచి ద్విచక్రవాహనంపై గంజాయిని తీసుకురాగా, వాహనం మారుస్తున్న వారు పోలీ సులను చూసి పారిపోయేందుకు యత్నించారు. ఈమేరకు వెంబడించడంతో ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.25వేల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఇద్దరు మైనర్లతో పాటు షేక్ గోరేమియా, చెరుకూరి సురేష్‌కుమార్, షేక్ ముషారఫ్, గజ్జి చరణ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


