వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశా యి. అండర్– 14,16, 18,20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమె న్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 1,500 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 220 ఈవెంట్లు నిర్వహించినట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఊర యుగేంధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా క్రీడాకారులు నువ్వా,నేనా అన్నట్లు పోటీపడగా 111 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. కాగా, బాలికల అండర్–18 విభాగంలో 22 పాయింట్లు, అండర్–20లో 28 పాయింట్లతో భద్రాద్రి జిల్లా అథ్లెట్లు విజేతలుగా నిలి చారు. సీనియర్ ఉమెన్ కేటగిరీలో 18 పాయింట్లతో ఖమ్మం జిల్లా అథ్లెట్లు ట్రోఫీ అందుకున్నారు. అలాగే, బాలుర సీనియర్ మెన్ చాంపియన్‌షిప్‌ను 32 పాయింట్లతో ఖమ్మం ట్రోఫీ దక్కించుకుంది. విజేతలకు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం నిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి ట్రోఫీలు అందజేశారు.
జిల్లా క్రీడాకారులకు 26 పతకాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా, 12 బంగారు, ఎనిమిది రజత, ఆరు కాంస్య పతకాలు గెలుచుకున్నారని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.మహీధర్ తెలిపారు. క్రీడాకారులు ఎం.శ్రీవిద్యాదొర, షేక్ ముబీన్, తోలేం శ్రీతేజ, షేక్ రియాజ్ పాషా, మధుప్రియ, వేదశ్రీ, సాయిఆదిత్య, అభినవ్‌నాయక్, పవన్, దివ్య, అక్షిత, సిద్ద వినయ్, బి.పల్లవి, బి.సౌమ్య, ఎస్‌కే.అమ్రిన్, కె.నవ్య, బి.పృథ్విక, గౌరి, గోవింద్, బి.హర్షిణి పతకాలు సాధించగా, క్రీడాకారులు, కోచ్‌లు పి.నాగేందర్, డి.మల్లికార్జున్‌రావు, జె.గిరిప్రసాద్‌ను డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి తదితరులు ఆదివారం అభినందించారు.


