42.8 అడుగులకు చేరిన గోదావరి | - | Sakshi
Sakshi News home page

42.8 అడుగులకు చేరిన గోదావరి

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 8 గంటలకు 42.8 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉంది. అయితే, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో రాత్రి నుంచి గోదావరి క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 35.80 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు 38.70 అడుగులు, ఉదయం 7 గంటలకు 40.40, సాయంత్రం 4 గంటలకు 42 అడుగులకు చేరింది. అనంతరం 5–30 గంటలకు 42.5 అడుగులకు చేరుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో వరద క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నీటమునిగిన సీతమ్మ విగ్రహం..

దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద నారచీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. గోదావరికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో సీత వాగులోకి చేరి నారచీరల ప్రాంతంతో పాటు సీతమ్మ విగ్రహం మునిగిపోవడమే కాక వరద రహదారిపైకి చేరింది.

నీట మునుగుతున్న పొలాలు

చర్ల: గోదావరి బ్యాక్‌ వాటర్‌ చర్ల మండలంలోని పంట చేలను ముంచెత్తుతోంది. మండలంలోని దేవరాపల్లి, కుదునూరు, తేగడ, దండుపేట, కొత్తపల్లి తదితర గ్రామాల్లోని చేన్లలోకి వరద చేరి పంటలు ముంపునకు గురయ్యాయి. దేవరాపల్లి, కుదునూరు మధ్యలోని జోడిచీలికలవాగు, తేగడ, దండుపేట సమీపాన తాలిపేరు నుంచి వచ్చిన గోదావరి బ్యాక్‌వాటర్‌ ఆదివారం సాయంత్రానికి ముంచెత్తగా మిర్చి, వరి పంటలు మునిగిపోయాయి.

రాత్రి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement