ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

ఎర్రుపాలెం: అతివేగానికి తోడు హెల్మెట్‌ ధరించకపోవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సమీపాన ఆది వారం జరిగిన ఈ ప్రమా దం వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లికి చెందిన కొరకొప్పుల ప్రేమ్‌కుమార్‌(32) మధిరలోని ఓ షోరూమ్‌లో వాషింగ్‌ మెషీన్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఎన్‌టీఆర్‌ జిల్లాకే చెందిన మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సగ్గుర్తి రాంబాబు ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో ప్రేమ్‌కుమార్‌ తన భార్య సౌజన్య, కుమార్తె ఆరాధ్య, కోడలు పూజితతో కలిసి ఎన్‌టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెద్దమ్మ ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఇదే సమయాన సగ్గురి రాంబాబు(40) స్వగ్రామం నుంచి ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని తన చెల్లి ఇంటికి మోపెడ్‌పై వస్తున్నాడు. బనిగండ్లపాడు – బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల మధ్య శ్రీఆంజనేయస్వామి గుడి రోడ్డు మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సమయాన బైక్‌లు వేగంగా ఉండడంతో తలకు తీవ్రగాయాలై ఘటనాస్థలిలోనే సగ్గుర్తి రాంబాబు మృతి చెందగా, ప్రేమ్‌కుమార్‌ను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ప్రేమ్‌ బైక్‌పై ఉన్న ఆరాధ్యకు సైతం గాయాలు కాగా, ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు ఎస్‌ఐ ఎం.రమేష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా.. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

హెల్మెట్‌ లేకపోవడంతో

తీవ్ర గాయాలై ఇద్దరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement