జ్ఞానేశ్వర్‌ ప్రజాస్వామ్య ద్రోహి.. | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్వర్‌ ప్రజాస్వామ్య ద్రోహి..

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

జ్ఞానేశ్వర్‌ ప్రజాస్వామ్య ద్రోహి..

కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులు జ్ఞానేశ్వర్‌ మిశ్రా ప్రజాస్వామ్య ద్రోహిగా వ్యవహరిస్తున్నందున వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా వ్యవహరించిన ఆయనపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ఖమ్మం గిరిప్రసాద్‌ భవన్‌లో జరిగిన సీపీఐ అనుబంధ ప్రజా సంఘాల సమావేశానికి జమ్ముల జితేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా హేమంతరావు మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి ఫలితా లను తారుమారు చేసిన జ్ఞానేశ్వర్‌ ఎన్నికల చరిత్రకు తీరని కళంకాన్ని తీసుకొచ్చారన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుచేయకపోగా, ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేలా వ్యవహరి స్తోందని, 22ఏ జాబితా తది తర సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత దూషణలకు పరిమితమయ్యారని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement