కల్లూరురూరల్: కల్లూరులోని జిల్లాపరిషత్ హైస్కూల్‌లో చదివి గత విద్యాసంవత్సరం ఎస్సెసీలో నియోజకవర్గంలోనే అత్యధిక మార్కులు సాధించిన శివనందిని ఉపకార వేతనానికి ఎంపికై ంది. ఈ సందర్భంగా శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో శు క్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమెకు గవర్నర్ శివప్రతాప్‌శుక్లా రూ.లక్ష చెక్కు అందజేశారు. ఆమె ను పాఠశాలఉపాధ్యాయులు, సిబ్బంది అభినిందించారు.
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా నెట్‌బాల్ సబ్ జూని యర్, జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 27న నిర్వహించనున్నారు. ఖమ్మంలోని హార్వె స్ట్ పబ్లిక్ స్కూల్‌లో ఈ పోటీలు జరుగుతాయని నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.దీప్తి, రుజిత తెలిపారు. క్రీడాకారులు వయసు ధ్రు వీకరణపత్రం, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు.


