ఎర్రుపాలెం: రాష్ట్ర ప్రభుత్వం హైదరా బాద్ రవీంద్రబారతి లో శనివారం నిర్వహించనున్న వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా తలుపుల విజయ్‌బాబు నియమితులయ్యా రు. ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఆయన నియామకంపై ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజయ్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.
వైస్‌చైర్మన్‌గా బ్రహ్మయ్య
బోనకల్: చాకలి ఐల మ్మ జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్‌గా బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన తమ్మారపు బ్రహ్మ య్య నియమితులయ్యారు. ఈమేరకు శనివా రం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
లయన్స్ హార్ట్, ఐ ఫౌండేషన్‌కు రూ.1.25 లక్షల విరాళం
వైరా: నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ మల్టీపుల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ సందర్భంగా లయన్స్ ఐ, హార్ట్ ఫౌండేషన్‌కు వైరా లయన్స్‌క్లబ్ తరఫున రూ. 1.25లక్షల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ బాధ్యులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, డాక్టర్ శ్యాంబాబు, లగడపాటి ప్రభాకర్, జోన్ చైర్మన్ తోటకూర శ్రీకాంత్, వైరా అధ్యక్షుడు కొల్లా రాంబాబుతో పాటు గద్దె నీరజ, సుగ్గల మాధవి, ఉండ్రు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిని క్లబ్ సభ్యులు అభినందించారు.
జర్మన్ భాష శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం రాపర్తినగర్: నర్సింగ్, ఫిజియోథెరపిస్ట్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు టామ్‌కామ్ ఆధ్వర్యాన ఉచితంగా జర్మన్ భాషలో ఇక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి తెలిపారు. జర్మన్ భాష శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలో అర్హత సాధిస్తే జర్మనీలో ఉద్యోగ ఎంపిక ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని పేర్కొన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు.
మడుపల్లి వాసికి డాక్టరేట్
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లి గ్రామానికి చెందిన అంబడిపూడి సునీల్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకా నికల్ ఇంజనీరింగ్ విభా గంలో డాక్టరేట్ లభించింది. ప్రస్తుతం పాలేరు జేఎన్‌టీయూహెచ్‌లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ‘అల్యూమినియం మిశ్ర మ లోహంలో సీసం, తగరం, నికెల్, టైటాని యం కణాలతో స్వయం మరమ్మతు లక్షణా లు, యాంత్రిక, ఘర్షణాత్మక ప్రవర్తనపై ప్ర యోగాత్మక పరిశోధన’ అంశంపై పరిశోధనా పత్రం సమర్పించారు. హైదరాబాద్ సీబీఐటీ ప్రొఫెసర్ ఎన్.వీ.శ్రీనివాసులు, ఓయూ సీని యర్ ప్రొఫెసర్ పి.రమేష్‌బాబు పర్యవేక్షణలో పరిశోధన చేసిన సునీల్‌కు ఓయూ నుంచి డాక్టరేట్ లభించింది.
స్తంభంపై నంబర్ చెబితే సమస్య పరిష్కారం
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతాన్ని త్వరగా గుర్తించి, వేగంగా పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈమేరకు జిల్లాలోని ప్రతీ విద్యుత్ స్తంభంపై యూనిక్ నంబర్ కేటాయించారు. ఇప్పటివరకు 33 కేవీ విభాగంలో 56 ఫీడర్లు, 11 కేవీ విభాగంలో 551 ఫీడర్లకు సంబంధించి ట్రాకింగ్‌లో భాగంగా నంబర్లు వేసే ప్రక్రియ పూర్తయింది. తద్వారా ఎక్కడైనా సమస్య ఏర్పడగానే ప్రజలు స్తంభంపై నంబర్ ఆధారంగా ఫిర్యాదు చేస్తే సిబ్బంది సులువుగా గుర్తించి త్వరగా చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక లైన్ల నిర్వహణ, పనుల పర్యవేక్షణ పారదర్శకంగా ఉంటుందని ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. సమస్య తలెత్తినప్పుడు వినియోగదారులు సమీపంలోని స్తంభంపై ఉన్న యూనిక్ నంబర్‌ను సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.


