పల్లెకు జలసిరి.. రోడ్లకు ‘హ్యామ్‌’ | - | Sakshi
Sakshi News home page

పల్లెకు జలసిరి.. రోడ్లకు ‘హ్యామ్‌’

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

● ఉపాధి పనులతో శాశ్వత ఆస్తుల సృష్టి ● ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క

● ఉపాధి పనులతో శాశ్వత ఆస్తుల సృష్టి ● ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క

సాక్షిప్రతినిఽధి, వరంగల్‌: గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానంతోపాటు నీటి భద్రత, ఉపాధి అవకాశాలు, శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క (అనసూయ) తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిలాల్ల్లో హ్యామ్‌ రోడ్ల పనులను అక్టోబర్‌ 25 నుంచి దశలవారీగా ప్రారంభిస్తామని చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల అధికారులతో వివిధ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క వివరాలు వెల్లడించారు.

వరంగల్‌ నుంచి ఖమ్మం వరకు

పనుల కదలిక..

రెండు ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పనులను షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభించాలని అధికా రులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క చెప్పారు. రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో 1,366 కి.మీ. మేర 445 రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ. 1,130 కోట్ల వరకు అవసరమని తెలిపారు. రోడ్ల జాబితాలో 90శాతం ఇప్పటికే ఉన్నవి అభివృద్ధి చేయనుండగా.. 10 శాతం కొత్త రహదారులు నిర్మి స్తామన్నారు. ప్రతీ ఆవాసం నుంచి గ్రామానికి, గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారి సౌకర్యం ఉండాలన్నదే ‘హ్యామ్‌’ లక్ష్యమని తెలిపారు. ఈ విధానంలో రోడ్లు నిర్వహణ బాధ్యత 15 ఏళ్లపాటు కాంట్రాక్టర్లకే ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

ఆస్తుల సృష్టి, నీటి భద్రత

ఉపాధి హామీ(వీబీజీ రామ్‌జీ) పథకాన్ని గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించేలా మారుస్తున్నట్లు సీతక్క తెలిపారు. జలసిరి కార్యక్రమం కింద ఇంటింటా ఇంకుడు గుంత, ప్రతీ ఊరికి ఊట కుంట, ప్రతీ పంటకు పంట కుంట నిర్మించడమే కాక ఏజెన్సీ గ్రామాల వాగుల వద్ద చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని చెప్పారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న గ్రామ సమగ్ర ప్రణాళికలను ఆవిష్కరిస్తామని తెలిపారు. కాగా, ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుతం తాగు అవసరాలకు సరిపడా నీరు ఉందని మంత్రి స్పష్టం చేశారు. అయినా వేసవిని దృష్ట్యా బోర్లు, మోటా ర్లు, రిజర్వాయర్లు, పైపులైన్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ దానకిషోర్‌, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, స్పెషల్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి, అడిషనల్‌ కమిషనర్‌ రవీందర్‌, మిషన్‌ భగీరథ, పీఆర్‌ ఈఎన్‌సీలు కృపాకర్‌రెడ్డి, జగదీశ్వర్‌, రెండు ఉమ్మడి జిలాల్ల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement