ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: టీజీఎస్‌ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈమేరకు మంగళవారం కార్మిక సంఘాల నాయకులతో ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, ఎన్నికల డిప్యూటీ రిటర్నింగ్‌ అధికారి ఎం.కోటేశ్వర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముసాయదా ఓటర్ల జాబితాను విడుదల చేయగా, రీజియన్‌ పరిధిలో 1,804మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, జాబితాపై ఈనెల 24వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటి పరిష్కారం అనంతరం 25న తుది జాబితా ప్రకటిస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా కార్మిక సంఘాల నాయకులు సహకరించాలని డీసీఎల్‌ కోటేశ్వర్లు కోరారు. కాగా, ముసాయిదా జాబితా ప్రకారం ఖమ్మం డిపోలో అత్యధికంగా 416మంది ఓటర్లు ఉండగా, భద్రాచలంలో డిపోలో 336 మంది, సత్తుపల్లిలో 296 మంది, మణుగూరులో 249 మంది, మధిరలో 193మంది, కొత్తగూడెంలో 179మంది, ఇల్లెందులో 106 మందితో పాటు ఆర్‌ఎం కార్యాలయంలో 29మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.

ఖమ్మం రీజియన్‌లో 1,804 మంది ఓటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement