జమలాపురం హుండీ ఆదాయం రూ.54.78 లక్షలు | - | Sakshi
Sakshi News home page

జమలాపురం హుండీ ఆదాయం రూ.54.78 లక్షలు

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ జిల్లా పరిశీలకులు ఆర్‌ సమత, ఈఓ కె జగన్మోహన్‌రావు సమక్షాన లెక్కించగా 98 రోజులకు గాను రూ.54,78,853 ఆదాయం నమోదైంది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌తో పాటు శ్రీసత్యసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

నేడు మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మం అర్బన్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. ఆతర్వాత మధ్యాహ్నం 2–30 గంటలకు ఖమ్మం ముస్తఫానగర్‌ సెంటర్‌లో చేరుకుని గణేశ్‌ శోభాయాత్రలో మంత్రి పాల్గొంటారు.

ధాన్యం నిల్వలకు గోదాంలు

అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం సహకారనగర్‌: ప్రస్తుత సీజన్‌లో సాగు చేస్తున్న వరి ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన గోదాంలను ముందస్తుగా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఎస్‌డబ్ల్యూసీ, ఏఎంసీ, ప్రైవేట్‌ గోదాంల యజమానులతో మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. అధికారులు గోదాంలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యం నిల్వకు అనుకూలంగా ఉన్నాయో లేదో నిర్ధారించాలని సూచించారు. సరిపడా హమాలీలు లేకపోతే వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈమేరకు డీటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీఎస్‌ఓ చందన్‌కుమార్‌, డీఎం మల్లికార్జున్‌ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రేపు జాబ్‌ మేళా

ఖమ్మం రాపర్తినగర్‌: ప్రైవేట్‌ రంగంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 24న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్‌.మాధవి తెలిపారు. అపోలో ఫార్మసీ, వరుణ్‌ మోటార్స్‌, భారత్‌ హుండాయ్‌లో ఉద్యోగాలకు ఖమ్మంలోని టీటీడీసీ భవన్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయని, డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, బీబీఏ, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. 18–35 ఏళ్ల లోపు వయసు కలిగి, అర్హతలు ఉన్నవారు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని, వివరాలకు 92841 107531, 70369 02902, 72079 17714 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

రెండు టీపీఎస్‌లకు రూ.10.91కోట్లు

చింతకాని: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల(టీపీఎస్‌) కోసం నిధులు మంజూరు చేసింది. చింతకాని మండలంలోని నాగులవంచ, కొదుమూరు పాఠశాలలను టీపీఎస్‌లుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. ఈమేరకు నాగులవంచ స్కూల్‌కు వసతుల అభివృద్ధికి రూ.5.19 కోట్లు, కొదుమూరు రూ.5.72 కోట్ల నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు మత్కేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంబటి వెంకటేశ్వరరావు, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో మొరాయించిన సర్వర్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: రిజిస్ట్రేషన్‌ శాఖలో మంగళవారం సర్వర్‌ మొరాయించగా సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో ఈ పరిస్థితి నెలకొనగా ఉమ్మడి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజువారీ పనులు ఆలస్యమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సమస్య కొనసాగగా ఒక్కో డ్యాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు దాదాపు గంటన్నరకు పైగా సమయం పట్టింది. దీంతో కార్యాలయాలకు వచ్చిన వారే కాక అధికారులు అవస్థలు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement