ఖమ్మం వైరారోడ్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. ఖమ్మం బుర్హాన్‌పురంలోని క్యాంపు కార్యాలయంలో 34 మందికి రూ.7లక్షల విలువైన చెక్కులను మంగళవారం అందజేశాక ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ఏటా రూ.2వేల కోట్లను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి చేసే సాయంపైనా సీలింగ్ విధించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు దండా జ్యోతిరెడ్డి, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, హరిప్రసాద్, పాల నాగేశ్వరరావు, లేడిబోయిన గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.


