భద్రతపై ఆందోళన
తాకిడి ఎక్కువే...
అత్యవసర ప్రమాదాలను నివారించడంపై సందేహాలు
ఆదిలాబాద్ ఘటనతో మొదలైన చర్చ
ఖమ్మంవైద్యవిభాగం: 2024 ఏడాది చివరిలో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కళాశాలకు చెందిన ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ(నవజాత శిశు సంరక్షణ కేంద్రం)లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి 10 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఏసీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరికొందరు చిన్నారులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఈక్రమాన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం, ఎస్‌ఎన్‌సీయూలో చిన్నారుల రక్షణపై చర్చ మొదలైంది. ఈమేరకు మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యాన పరిశీలించగా ఆందోళనకరమైన పరిస్థితులు లేకున్నా.. అనుకోని ఘటన జరిగితే పరిస్థితిని ఎంత వేగంగా అదుపులోకి తీసుకొస్తారో చెప్పలేని పరిస్థితి కనిపించింది.
విభాగాల వారీగా చికిత్స
జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలు అందిస్తారు. గ్రౌండ్ ఫ్ల్లోర్‌లో ఓపీ విభాగాలు ఉండగా మొదటి, రెండో అంతస్తులో బాలింతలు, చిన్నారుల ఇన్ పేషంట్ వార్డులు ఉన్నాయి. ఇక నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)లోని 20 వార్మర్లలో బరువు తక్కువగా పుట్టిన నెలలోపు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. అలాగే పీడియాట్రిక్ ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్(పీఐసీయూ)లో 20 మంది, చిల్ట్రన్స్ వార్డులో 38 మంది, న్యూట్రీషన్ రీ హ్యాబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్‌సీ)లో 20 మందికి చికిత్స చేసే సామర్థ్యం ఉంది. నెలలు నిండకుండా పుట్టిన, బరువు తక్కువ ఉన్న వారే కాక వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తారు. నెలలోపు చిన్నారులను ఇందులోని వార్మర్లలో చికిత్స చేస్తారు. ఆపై వయస్సు గలవారైతే పీఐసీయూలో చికిత్స చేసి కోలుకున్నాక చిల్డ్రన్స్ వార్డుకు తరలిస్తారు. అలాగే, పోషకాహార లోపం ఉన్న వారికి ఎన్‌ఆర్‌సీలో చికిత్స అందిస్తారు.
ఎస్‌ఎన్‌సీయూ విషయంలో భద్రతా పరంగా ఏ ఇబ్బంది లేదు. ముందస్తుగా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అయితే, ఎస్‌ఎన్‌సీయూ సరిపోనందున మరో
అంతస్తు నిర్మాణానికి ప్రతిపాదించాము. అయినా ప్రస్తుతం ఎంసీహెచ్‌లో వైద్యసేవల విషయంలో ఢోకా లేదు. చిన్నారుల విషయంలో ప్రత్యేక
జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ నరేందర్,
మెడికల్ సూపరింటెండెంట్, జీజీహెచ్
శిశువులకు అత్యవసర చికిత్స అందించే ఎస్‌ఎన్‌సీయూ యూనిట్‌ను ఇరుకై న చోట ఏర్పాటు చేశారు. తాకిడి ఎక్కువగా ఉండడంతో యూనిట్ ఏ మాత్రం సరిపోవట్లేదు. అంతేకాక ఇరుకై న ప్రాంతం కావడంతో భద్రతాపరంగా ఆందోళన చెందాల్సి న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం 20 – 25 ప్రసవాలు జరుగుతుండగా.. ఇతర ఆస్పత్రుల్లో జన్మించి అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారులను కూడా ఇక్కడే తీసుకొస్తుండడంతో సేవలు అందించడం ఇబ్బందిగా మారింది. అంతేకాక రక్షణ ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో లేవనే చెప్పాలి. అనుకోని ప్రమాదం జరిగితే పసిగట్టడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం.. చిన్నారుల తల్లిదండ్రుల ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం ఉన్న యూనిట్‌ను విశాలమైన ప్రాంతానికి తరలిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు. అధికారులు మేల్కొని ప్రమాదాలు జరగకముందే ఎస్‌ఎన్‌సీయూపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ఎస్‌ఎన్‌సీయూ, తదితర విభాగాల్లో
వెంటిలేటర్ సదుపాయం కూడా ఉంది. అయితే నవజాత శిశు మరణాలను
తగ్గించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌ఎన్‌సీయూకు తాకిడి పెరుగుతోంది. వివిధ అనారోగ్య కారణాలతో పుట్టిన
శిశువులను వార్మర్లలో ఉంచి చికిత్స అందిస్తే ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుంది. శిశువులకు తల్లి గర్భంలో మాదిరి
వెచ్చదనాన్ని అందిస్తూ చికిత్స చేయడానికి వార్మర్లు వినియోగిస్తుంటారు. ఉమ్మడి జిల్లాతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా
శిశువులను ఇక్కడకు తీసుకొస్తుండడంతో ఎస్‌ఎన్‌సీయూ కిటకటలాడుతుంటుంది.
జనరల్ ఆస్పత్రిలో ఇరుకుగా ఎస్‌ఎన్‌సీయూ


