నేలకొండపల్లి: ప్రభుత్వ భుములలో అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపుపై అధికారులు స్పందించారు. మండలంలోని అప్పలనరసింహాపురంలో తవ్వకాలపై ‘ఇష్టారాజ్యం’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచరితమైంది. దీంతో కలెక్టర్ ఆదేశాలతో సోమవారం మైనింగ్, రెవెన్యూ అధికారులు అప్పలనరసింహాపురంలో పర్యటించారు. సర్వే నంబర్ 342లోని మట్టి తవ్వకాలను పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఎంఆర్‌ఐ ఆలస్యం మధుసూదన్‌రావు మాట్లాడుతూ నివేదికను కలెక్టర్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక మట్టి తవ్వకాలకు యంత్రాలు వస్తే సీజ్ చేయడమే కాక కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


