అభివృద్ధి, సంక్షేమంలో పురోగతి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమంలో పురోగతి

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

8లో

గరిష్టం / కనిష్టం

330 / 260

న్యూస్‌రీల్‌

రెండో విడతలో 10,400 ఇళ్లు

విద్యార్థుల సంక్షేమానికి

విప్లవాత్మక నిర్ణయాలు

దశాబ్దాల తర్వాత భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే

చేయూతలో 1,81,828 మందికి రూ.83.42 కోట్ల పింఛన్లు

స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

అగ్ర స్థానంలో జిల్లా

ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజావాణి
జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా ఇకనుంచి ప్రతీ సోమవారం ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తారు.

వాతావరణ ం

జిల్లాలో ఆదివారం ఉదయం నుంచే ఎండ ప్రభావం ఉంటుంది. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడే అవకాశముంది.

ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026

శ్రీవారికి అభిషేకం,

నిత్యకల్యాణం

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జీపీ భవన నిర్మాణానికి రూ.5లక్షల విలువైన

స్థల వితరణ

బోనకల్‌: బోనకల్‌ మండలంలోని సీతానగరంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నల్లమోతు సీతయ్య జ్ఞాపకార్థం రూ.5లక్షల విలువైన 258 చదరపు గజాల స్థలం అందించనున్నట్లు ఆయన కుమారుడు నాగేశ్వరరావు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా స్థల అగ్రి మెంట్‌ పత్రాలను శనివారం సర్పంచ్‌ కొమ్మగిరి బిక్షమయ్యకు అందజేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ పదేళ్లుగా స్థలం లేకపోవడంతో జీపీ భవనం నిర్మించలేదని, ఇప్పుడు నాగేశ్వరరావు ముందుకురావడంతో సమస్య పరిష్కారమైందన్నారు. ఉపసర్పంచ్‌ సాదినేని భవాని, వార్డుసభ్యులు బొల్లం నరేష్‌, గుడారి వెంకయ్య, సంగీతపు కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి వినోద్‌, తదితరులు పాల్గొన్నారు.

కారేపల్లి వాసికి శౌర్యపతకం

కారేపల్లి: మండలంలోని భల్లునగర్‌తండా గ్రామ వాసి, గ్రేహౌండ్స్‌ ఆర్‌ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేందర్‌కు విధినిర్వహణలో ప్రతిభకు గాను శౌర్య పతకం లభించింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయనకు గ్రేహౌండ్స్‌ డీజీపీ అనిల్‌కుమార్‌ పతకం అందజేశారు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘విద్యార్థుల విద్య, ఆరో గ్యం, పోషకాహారం, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. సెంట్రలైజ్డ్‌ కిచెన్లను అన్ని గురుకుల, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలకు విస్తరిస్తాం. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతుభరోసా, రుణమాఫీ పథకాలు అమలు చేస్తున్నాం.’ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే..

వ్యవసాయానికి ప్రాధాన్యత

రైతు భరోసా పథకం ద్వారా 3,41,913 మంది రైతులకు రూ.427.97 కోట్లు, రుణమాఫీ కింద 1,31,760 మంది రైతులకు రూ.912.10 కోట్లు, రైతు బీమా ద్వారా 803 మంది కుటుంబాలకు రూ.40.15 కోట్లు జమ చేశాం. 44,568 మంది రైతుల నుంచి రూ.681.49 కోట్ల విలువైన 2,83,956.397 మె.టన్నుల మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేశాం.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లాలోని 26 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌సీలు, తొమ్మిది బస్తీ దవాఖానాలు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. జనరల్‌ ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని పూర్తి చేశాం.

చకచకా ప్రాజెక్టులు

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు లింక్‌ కాల్వ నుంచి 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. మున్నేరు – పాలేరు లింక్‌ కాల్వను రూ.107.65 కోట్లతో నిర్మిస్తున్నాం. జవహర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని రూ.630.30 కోట్లతో చేపట్టాం. మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టుకు అదనపు నీరు అందించే పనులు పురోగతిలో ఉన్నాయి. కొదుమూరు – వందనం ఎత్తిపోతల పథకం రెండో దశ ద్వారా మరో 2,500 ఎకరాలకు సాగునీరు అందనుంది.

మహిళా డెయిరీతో

ఆర్థిక పరిపుష్టి

‘ఇందిరా మహిళా శక్తి’లో భాగంగా 20 వేల స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యుల ఆర్థికస్థితిని పరిపుష్టి చేసేందుకు ఇందిరా మహిళా డెయిరీ స్థాపించాం. పైలట్‌ ప్రాజెక్ట్‌గా మధిర నియోజకవర్గంలో సభ్యులకు రూ.2లక్షల విలువైన రెండేసి పాడి గేదెలను సబ్సిడీపై అందించి పాలు కొనుగోలు చేస్తున్నాం. చేయూత పథకం కింద 1,81,828 మంది లబ్ధిదారులకు రూ.83.42 కోట్ల విలువైన పింఛన్లు పంపిణీ చేశాం.

వివాదాల పరిష్కారానికి రీసర్వే

భూసరిహద్దులతో ఎదురవుతున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి దాదాపు 96 ఏళ్ల తర్వాత ప్రభుత్వం రీ సర్వే ప్రక్రియ చేపట్టింది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, సత్తుపల్లి మండలం బేతుపల్లి, కూసుమంచి మండలం భాగవతవీడులో రీ–సర్వే కొనసాగుతోంది. జిల్లాలోని 70 గ్రామాల్లో రీ–సర్వే దశలవారీగా జరుగుతుంది.

మౌలిక సదుపాయాల కల్పన

ఖమ్మం ఆర్‌ అండ్‌ బీ సర్కిల్‌ పరిధిలో 179 అభివృద్ధి పనులు మంజూరు కాగా, 13 పూర్తయ్యాయి. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ కింద రూ.1,227.13 కోట్లతో 37 రహదారుల పనులు కొనసాగుతున్నాయి. కోదాడ – ఖమ్మం, ఖమ్మం – దేవరపల్లి, వరంగల్‌ –ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు వేగంగా సాగుతున్నాయి. ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దేలా రహదారుల విస్తరణ, డ్రెయినేజీలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపడుతున్నాం. ఏదులాపురం మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టిన పనులు 60 శాతానికి పైగా పూర్తవగా, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరుల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, డీఎఫ్‌ఓ అనూజ్‌ అగర్వాల్‌, ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పారస్‌ కుమార్‌, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల అభివృద్ధి సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శనలో విద్యార్థులు

అక్షరాస్యతలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానాన ఉండగా, పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది. బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 66,882 మంది విద్యార్థులు చేరారు. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది 9శాతం ప్రవేశాలు పెరిగాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు జిల్లాలో ఐదు యంగ్‌

ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను

రూ.200 కోట్ల చొప్పున వ్యయంతో

నిర్మిస్తున్నాం.

జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా తొలి విడతలో 16,243 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 10,396 నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు రూ.454.97 కోట్ల ఆర్థిక సాయం అందింది. రెండో విడతలో ఐదు నియోజకవర్గాలకు 7,800 కొత్త ఇళ్లు, 2,600 పైకప్పు మార్పిడి గృహాలు కలిపి మొత్తం 10,400 మంజూరయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement