ఆర్థిక పరిస్థితులతో న్యాయానికి దూరం కావొద్దు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక పరిస్థితులతో న్యాయానికి దూరం కావొద్దు

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

ఖమ్మంలీగల్‌: ఏ ఒక్కరు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా న్యాయానికి దూరం కావొద్దనేదే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ఖమ్మం ఎంజేపీటీబీసీ పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అర్హులైన వారికి సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు న్యాయవాది సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు న్యాయం పొందే హక్కు, ఉచిత న్యాయ సాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement