స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలో ఉత్తమ ఉద్యోగులు, అధికారులుగా ఎంపికై న వారికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈక్రమాన అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒకరి ప్రశంసాపత్రాలు ఇంకొంకరికి అందాయి. తీరా వేదిక దిగి చూసుకున్నాక విషయం తెలిసింది. దీంతో తమ సర్టిఫికెట్ కోసం కొందరు ఉద్యోగులు జాబితా చదువుతున్న వారి వద్దకు వెళ్లి ఆరా తీయడం కనిపించింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్


