అత్యధిక ఓటర్లు తక్కువ ఓటర్లు
నియోజకవర్గం సంఖ్య పీఎస్ సంఖ్య పీఎస్
ఖమ్మం 1165 గోపాలపురం 255 మంగ్యాతండా
పాలేరు 1,185 వరంగల్ క్రాస్‌రోడ్డు 176 రేగులతండా
మధిర 1,169 బోనకల్ 264 గట్లగౌరారం
వైరా 1,155 అష్ణగుర్తి 136 నాళ్లబండబోడు
సత్తుపల్లి 1,184 బేతుపల్లి 232 గట్టుగూడెం
ఖమ్మం సహకారనగర్: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,460 పోలింగ్ కేంద్రాలకు గాను ఓటర్ల గణాంకాలు ప్రాథమికంగా తేలాయి. జిల్లాలో అత్యధికంగా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం వరంగల్ క్రాస్‌రోడ్డులోని పోలింగ్ స్టేషన్ పరిధిలో 1,185 మంది ఓటర్లు, అత్యల్పంగా వైరా నియోజకవర్గం నాళ్లబండ బోడు పీఎస్‌లో కేవలం 136 మంది ఓటర్లే ఉన్నట్లు గుర్తించారు. అయితే, ముసాయిదా జాబితా విడుదల చేశాక అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం ఇందులో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది.


